పగిలిన నర్సింగప్ప కొండను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బీవీ
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్ల నందు పర్యటించి గోనెగండ్ల గ్రామంలో గల నరసింగప్ప కొండ బండ రాయి ఎండ వేడికి ఇటీవల పెద్ద శబ్దంతో పగిలి పెద్ద చీలిక ఏర్పడిన నరసప్ప కొండను మేజర్ గ్రామ సర్పంచ్ హైమావతి, మరియు టిడిపి నాయకులతో కలిసి గురువారం ఎమ్మిగనూరు మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డా.బి వి జయనాగేశ్వర రెడ్డి కొండ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టూ పక్కల ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించి, ఎండ వేడికి పగిలిగిన నర్సింగప్ప కొండ బండ రాయి నుండి ఎలాంటి ప్రాణ, ఆర్ధిక నష్టం వాటిల్ల కుండా ముందస్తు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని అధికారులను కోరారు.అలాగే ఉష్ణోగ్రతలు ఎక్కవగా ఉన్నాయని ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటికి తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాంపురం ఖాసిం, మండల కన్వీనర్ నజీర్ సాహెబ్, మండల కార్యదర్శి తిరుపతయ్య, జిల్లా మైనార్టీ నాయకులు బేతాళబడేసా, మారేష్, మునిస్వామి, నాగరాజు, చంటి ఫక్రుద్దీన్, రహంతుల్లా, లక్ష్మి కాంత్, మదీనా, కౌలుట్లయ్య ఎర్రబాడు శీను తదితరులు పాల్గొన్నారు.