కొల్లేరు వాసుల నుండి అక్రమంగా వసూలు చేసిన మాజీ ఎమ్మెల్యే
1 min read
కోట్లాది రూపాయల లీజు సొమ్ములు తిరిగి చెల్లించే వరకు వదిలే ప్రసక్తి లేదు
విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తిన కొల్లేరు నాయకులు
సైదు సత్యనారాయణ, కూటమి నేతలు బొప్పన సుధాకర్,నేతల రవి,నంబూరి నాగరాజు ధ్వజం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు. అబ్బయ్య చౌదరి కొల్లేరు చేపల చెరువుల తవ్వకాలకు సంబంధించి కొల్లేరు వాసులనుండి అక్రమంగా వసూలు చేసిన కోట్లాది రూపాయల లీజు సొమ్ములు తిరిగి చెల్లించే వరకు అబ్బయ్య చౌదరి ని వదిలే ప్రసక్తి లేదని కొల్లేరు సంఘ నాయకులతో కలిసి దెందులూరు నియోజకవర్గస్తాయి కూటమి నాయకులు హెచ్చరించారు.
జిల్లా టిడిపి కార్యాలయంలో
ఆదివారం కొల్లేరు సంఘ నాయకులతో కలిసి దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కొల్లేరు సంఘ నాయకులు సైదు సత్యనారాయణ, నేతల రవి, నంబూరి నాగరాజు, బొప్పన సుధాకర్ లు మాట్లాడుతూ ఈ నెల నాలుగవ తేదీన దెందులూరు మాజీ ఎమ్మెల్యే తన స్వగ్రామమైన కొండలరావు పాలెంలో ఏర్పాటు చేసిన జిల్లా స్తాయి వైసిపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, తదితరులను అండగా చూసుకుని మా నాయకుడు చింతమనేని ప్రభాకర్ పై రెచ్చిపోయి మాట్లాడిన అబ్బయ్య చౌదరి పై కూటమి నాయకులు తీవ్ర స్తాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కొల్లేరులో కోట్లాది రూపాయల లీజు వసూళ్ల పై బహిరంగ చర్చకు రావాలని నాగరాజు అనే కూటమి నాయకుడు సవాల్ చేశాడు. కొల్లేరు బాధితుల తరపున మీ ఇంటిన ముట్టడించినప్పుడు నువ్వు నీ తండ్రి కొఠారు రామచంద్రరావుతో కలిసి మేము మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని మమ్మల్ని ఎందుకు ప్రశ్నించలేదని సూటిగా ప్రశ్నించారు.మా నాయకుడు చింతమనేని పదిమందికి భోజనం పెట్టే నాయకుడని మీలాగా కొల్లేరులో మీ మనుషులను పెట్టీ లీజు వసూళ్లకు పాల్పడే నాయకుడు కాదని ఘాటైన విమర్శలు చేస్తూ ధ్వజమెత్తారు.పాత్రికేయ సమావేశంలో నేతల రవి, సైదు సత్యనారాయణ, బొప్పన సుధాకర్ మాట్లాడుతూ మాజీ ఎమ్ ఎల్ ఏ కొల్లేరులో లీజులు వసూలు చేయనప్పుడు కొంతమంది కూటమి నాయకులతో రాజీ చర్చలు ఎందుకు జరుపుతున్నారని ప్రశ్నించారు. కొల్లేరు సంఘ నాయకులకు మద్దతుగా నిలిచిన కూటమి నాయకులుమాజీ ఎంఎల్ఏ కొల్లేరు వాసులకు 6కోట్ల రూపాయలు చెల్లించేవరకు కొండలరావు పాలెంలో అబ్బయ్య చౌదరి ఇంటిని ముట్టడించి ధర్నాలు చేస్తూనే ఉంటామని, కొల్లేరు సంఘ నాయకులకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తామని హెచ్చరికలు చేశారు. ఈకార్యక్రమంలో మోత్కురి నాని, మాగంటి నారాయణ ప్రసాద్, దేవరపల్లి ఆదాము,ఈడ్పుగంటి అనిల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.