మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి ఇకలేరు
1 min read
విజయవాడ: కాకర్ల పూడి సుబ్బరాజు నిజాయితీ నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యునిగా, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా పని చేశారు. సింగ్ నగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం అయన కృషిలో భాగమే. సాంస్కృతిక కళా రంగాలకు కళాకారులను ప్రోత్సహించారు. ఆయన అకాల మరణం విచారకరం. ఆయన సేవలను పలువురు నేతలు కొనియాడారు. అమెరికా నుండి కుమారుడు,కుమార్తె రానున్నారు. సుబ్బరాజు అంత్యక్రియలు శనివారం విజయవాడలో జరగనున్నాయి. కాకర్లపూడి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని పలువురు సీపీఐ నాయకులు అన్నారు.