PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి అప్పలరాజుతో మాజీ ఎమ్మెల్యే భేటీ

1 min read

అమరావతి:రాష్ట్ర మత్స్య & పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సాంప్రదాయ మత్స్యకారులకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, మంత్రి తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై లబ్బి వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమ నది పరివాహక ప్రాంతాల్లోని మత్స్యకారులకు సంక్షేమ పథకాలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోరగా.. స్పందించిన మంత్రి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

About Author