నగరపాలక సంస్థ కమిషనర్ ని కలిసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే
1 min read
కల్లూరు అర్బన్ న్యూస్ నేడు : 19వ వార్డు గణేష్ నగర్ లోని పులే అంబేద్కర్ నగర్ కాలనీలో గత 24 సంవత్సరాల నుంచి నివాసముంటున్న పేద ప్రజలను కర్నూలు మున్సిపాలిటీ అధికారులు, గవర్నమెంట్ అధికారులు వారిని కాలిచేయించాలి అని అక్కడ నివసిస్తున్న 300 మంది స్థానిక ప్రజలకు తాగడానికి నీళ్ల రాకుండా.. మంచినీటి బోర్లను తీసి వేయించడం అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ని కలిసి వారికి అన్ని సదుపాయాలు మరొకచోట కల్పించిన తర్వాతనే. తగు నిర్ణయం తీసుకోవాలి అని. వారికి మంచినీరు మిగతా సదుపాయాలు కల్పించాలని. కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 19వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.