గడ్డి వాము దగ్ధం… రైతు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి మండలంలోని పెద్ద పుదిల్లా గ్రామంలో రైతు పొలంలో ఉన్న పశుగ్రాసం దగ్ధం కావడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారు. అప్పటికే పూర్తిగా కాలిపోయిన పశుగ్రాసం అది తెలుసుకున్న మాజీఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ రైతు కుటుంబంను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. మరియు ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తానని రైతు కుటుంబమునకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి ప్రభాకర్ రెడ్డి, తెదేపా నాయకులు ప్రసాద్ రెడ్డి, మాజీ డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజనారాయణమూర్తి మాజీ ఎంపీపీ టి.శ్రీనివాసులు,ఖజాఫీర్, సుదర్శన్, సంజీవరెడ్డి, తెదేపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.