అంగన్వాడీల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
1 min readధైర్యంగా ఉండండి టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుంది
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరుజిల్లాపెదవేగిఅంగన్వాడీల నిరసనకు దెందులూరు మాజీ ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ బుధవారం మద్దతు తెలిపారు.అంగన్వాడీలు చేస్తున్న నిరసన ధర్నాలకు అండగా ఉంటానని చింతమనేని ప్రభాకర్ బుధవారంపెదవేగి మండల కేంద్రం లో రెండురోజులుగా అంగన్వాడీ వర్కర్ లు చేస్తున్న నిరసన శిబిరానికి చేరుకుని వారికి మద్దతు ప్రకటించారు.అంగన్వాడీలు తలుచుకుంటే ప్రభుత్వాలనే కూల్చేస్తాయని అన్నారు.ధైర్యంగా ఉండండి మీ వెనుక టి డి పి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.మీ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తప్పని సరిగాపరిష్కరిస్తుందని చెప్పారు.ఎన్నికలు దగ్గర పడ్డాయనిమీ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరించే సమయం ప్రభుత్వానికి ఆసన్నమైందని చింతమనేని అంగన్వాడీలతో అన్నారు.కనీస వేతనం 26 వేల రూపాయలు. నాణ్యమైన వంట సరకులు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటి ఇవ్వాలని. ఎఫ్ ఆర్ ఎస్ యాప్ రద్దు చేయాలని. రిటైర్మెంట్ బెనిఫిట్ గా 5లక్షలు ఇవ్వాలని. వేతనం లో సగం పెన్షన్ గా అందించాలని.ఐ సి డి ఎస్ కి బడ్జెట్ పెంచాలని.మినీ అంగన్వాడీ సెంటర్ లను మెయిన్ సెంటర్ లు గా ఆప్ గ్రేడ్ చెయ్యాలని.ఇంటి అద్దె బకాయిలు .బిల్లులు వెంటనే చెల్లించాలని ఈ నిరసన కార్యక్రమం లో అంగన్వాడీలతో బాటు దెందులూరు మాజీ ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో టి డి పి నాయకుడు తాతా సత్యనారాయణ. సి పి ఎం నాయకులు కె శ్రీనివాస్ ప్రజా సంఘాల నాయకులు పెదవేగి మండల పరిధిలో పనిచేసే అంగన్వాడీ వర్కర్ లు హెల్పర్ లు పాల్గొన్నారు.