NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ నేత గోవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ

1 min read

– లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేత

– ఆయన సేవలో పార్టీకి ఎనలేనివి..

– చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ కొల్లేరు ప్రాంత నాయకుడు సైదు గోవర్ధన్ కుటుంబాన్ని మాజీ పార్లమెంటు సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) , పలువురు పార్టీ నేతలు బుధవారం సాయంత్రం ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈసందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ ఆపదలో ఉన్న కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, కొల్లేరు ప్రాంత సమస్యలపై నిరంతరం పోరాడు తున్న నాయకుడు గోవర్ధన్ అని అన్నారు. గతంలో ఆయన సేవలో పార్టీకి ఎనలేనివి అన్నారు. ఈప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కు బరోసానిస్తూ నిత్యం పార్టీ ప్రతిష్టతకు గోవర్ధన్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్ళ నుంచి శ్రీపర్రు గ్రామంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు పార్టీలతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం చేశారని అన్నారు. ఇటువంటి నేతల సేవలు పార్టీకి ఎంతో అవసరమని, గోవర్ధన్ త్వరగా కోలుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లు పార్టీ కార్య కర్తలకు ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. ఈసందర్భంగా మాగంటి బాబు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని గోవర్ధన్ కు అందజేశారు. ఈకార్యక్రమంలో పెదపాడు మాజీ ఎంపిపి మోరు శ్రావణి, టీడీపీ నాయకులు నేతల రవి, మాజీ జడ్పిటిసి రామ సీత, గుత్తా అనిల్ కుమార్, చాటపర్రు టీడీపీ నేత త్రినాథ్ ,గుడివాకలంక జయ మంగళ దొరబాబు, కొత్తూరు రాజు, మాదేపల్లి పైడిపాటి శేఖర్ ,చింతపల్లి ఇమ్మానియేలు, పలువురు మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను పరామర్శించిన వారిలో ఉన్నారు.

About Author