మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ని సత్కరించిన బ్రాహ్మణ సంఘం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ మాజీ రాజ్యసభ సభ్యులుని కలిసి నిన్న జరిగిన కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం వారి విజయోత్సవ సభ సందర్భంగా కలవడం వారిని ఘనంగా సత్కరించడం మెమెంటో అందజేయడం జరిగింది. తర్వాత వారు మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధికి దాదాపు 25 లక్షలు ఖర్చుపెట్టి దేవాలయాన్ని చాలా సుందరంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి సంకల్పించారు. అందుగ్గాను పని కూడా మొదలైంది దాదాపు ఇంకొక 40 రోజుల్లో కూడా ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయి దేవాలయం సర్వాంగ సుందరంగా ఏర్పాటు అవుతుందని నమ్ముతున్నాము ఇంకా అపరకర్మ లో భవనం గురించి కూడా చర్చించడం జరిగింది ఏమైనా సమస్యలున్న పరిష్కరిస్తాను దాన్ని పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసి బ్రాహ్మణులకు అందుబాటులోకి తెస్తాను అని అన్నారు. మేమంతా కూడా చాలా సంతోషించి వారి కృతజ్ఞతలు తెలుపుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. సండేల్ చంద్రశేఖర్ అధ్యక్షుడు , చెరువు వెంకట దుర్గాప్రసాద్ గౌరవ అధ్యక్షులు, శ్రీ చల్లా నాగరాజు శర్మ కార్యదర్శి, కంచు గంటల శ్యామసుందర్రావు ఉపాధ్యక్షుడు, మరియు ముఖ్య సలహా శ్రీ టీవీ రవిచంద్ర శర్మ పాల్గొనడం జరిగింది.