సొంత గూటికి చేరిన టిడిపి పార్టీ మాజీ ఎంపీపీ గెజ్జహళ్లి సిద్దప్ప
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: హొళగుంద మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ,మాజీ మండల కన్వీనర్ అయిన గెజ్జహళ్లి సిద్దప్ప బుధవారం ఆలూరు టిడిపి కార్యాలయంలో ఆలూరు టిడిపి ఇంచార్జ్ వీరభద్రగౌడ్ సమక్షంలో పెద్దఎత్తున అనుచర గణంతో కలిసి తమ స్వంత గూడైన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.ఆలూరు టిడిపి ఇంచార్జ్ వీరభద్రగౌడ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గెజ్జహళ్లి సిద్దప్ప పార్టీ కొరకు విశిష్ట సేవలను అందించారని వారి పునః ఆగమనం తెలుగుదేశం పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని తెలిపారు, నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సువర్ణ పాలన ప్రజల మన్ననలను పొందుతూ సంక్షేమ పారదర్శకతలతో రాష్ట్ర ప్రజానికానికి మరింత చేరువవుతుందన్నారు. అలాగే తన స్వంత మండలమైన హొళగుందలో టిడిపి బలోపేతానికి ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ తిప్పయ్య, సీనియర్ నాయకులు ఎల్లార్తి మల్లికార్జున, తోక వెంకటేష్, మాజీ ఎంపీటీసీ కూడ్లుర్ ఈరప్ప, నాయకులు ఐకల్ అయ్యప్ప, దమ్ముల తిక్కస్వామీ,కన్నయ్య,చాకలి భద్రి, మంగలి సంజీవ్,కొరివి సాయిబెష్, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.