ఎమ్మెల్సీకి నాలుగు నామినేషన్లు దాఖలు
1 min read– వైయస్ జగన్మోహన్ రెడ్డికి జన్మాంత రుణపడి ఉంటా.. కౌవురు శ్రీనివాస్
– వై యస్ ఆర్ పార్టీ పాలనలోనే ప్రజలకు మంచి పరిపాలన.. వంకా రవీంద్రనాథ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం నాలుగు నామినేషన్ లు దాఖలయ్యాయి. వై.ఎస్.ఆర్.సిపి పార్టీ తరపున జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్, తణుకు కు చెందిన వంకా రవీంద్రనాథ్, వంకా రాజకుమారి, టీడీపీ తరపున వీరవాసరం నకు చెందిన వీరవల్లి చంద్రశేఖర్ తమ నామినేషన్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి . అరుణ్ బాబు కు నామినేషన్ పత్రాలను అందజేశారు. వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్ నామినేషన్ సమయంలో రాష్ట్ర మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు, కొఠారు అబ్బయ్యచౌదరి , ప్రభృతులు ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు మొత్తం 5 నామినేషన్లు దాఖలు అయ్యాయి జిల్లా రెవిన్యూ అధికారి మరియు సహాయ రిటర్నింగ్ అధికారి ఏ.వి. ఎన్.ఎస్. మూర్తి, ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోని ప్రతిష్టాత్మక మైనటువంటి పాలన అందిస్తున్న అన్నారు. అదేవిధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారని గత 50 ఏళ్లలో పరిపాలన చేసిన ఏ ఒక్క రాజకీయ నాయకులు బీసీలకు ఎంత సంస్కృతి స్థానం కల్పించిన దాఖలా లేవన్నారు, నా తల్లిదండ్రులు సుకృతమో, నా పూర్వజన్మ సుకృతమో తెలియదు కానీ నాకు ఇంతటి పదవిని స్థానాన్ని కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మంతా రుణపడి ఉంటాను అన్నారు, కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ పార్టీని 175 కు 175 సీట్లు గెలిపించి ఆయనకు కానుకగా అందిస్తామన్నారు, పాలకొల్లు నియోజకవర్గంలో మాకు తిరుగులేదు అనుకున్న పార్టీ వారి అంచనాలను పటాపంచలు చేసి అక్కడ వైయస్సార్ జెండా ఎగరవేస్తామన్నారు, మాకు స్థానికంగా ఎవరికి ఏ విధమైన విభేదాలు లేవని అందరం పార్టీకి కట్టుబడి ముందు ముందు ఎన్నికలకు సమయుతమై కలిసికట్టుగా పని చేస్తామన్నారు, వంక నవీంద్రనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు, ఆయనకు ప్రజలకు ఇచ్చిన మాట తప్పని మడమ తిప్పని తండ్రి పాటలో నడిచి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతున్నారు అన్నారు, మాకు ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న అన్నారు, పార్టీ పార్టీ గెలుపుకు కష్టంచే పనిచేసి విజయానికి బాటలు వేస్తామన్నారు.