NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోజుకు నాలుగు షోలే.. ఆన్ లైన్ లో సినిమా టికెట్లు !

1 min read

Empty cinema screen with audience. Ready for adding your picture. Screen has crisp borders. This shot was made using tripod with long exposure.

పల్లెవెలుగు వెబ్​:ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినిమా రంగానికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. సినిమా థియేట‌ర్ల‌లో రోజుకు నాలుగు షోలు మాత్ర‌మే వేయాల్సిన చోట‌.. ఆరేడు వేస్తున్నార‌ని అన్నారు. ఇక నుంచి రోజుకు నాలుగు షోలో వేయాల‌ని అన్నారు. బెనిఫిట్ షోల రూపంలో 500 నుంచి 1000 రూపాయ‌ల వ‌ర‌కు టికెట్లు వ‌సూలు చేస్తున్నార‌ని అన్నారు. ఏ చ‌ట్టం మ‌మ్మ‌ల్ని ఏమీ చేయ‌లేద‌ని కొంద‌రు ధీమా వ్య‌క్తం చేస్తున్నార‌ని, మ‌రికొంద‌రు ఏ చ‌ట్ట‌మైనా త‌మ‌కు అనుకూలంగా ఉండాల‌ని భావిస్తున్నార‌ని చెప్పారు. ఇక పై ప్ర‌భుత్వం చెప్పిన స‌మ‌యాల్లోనే సినిమా ప్ర‌ద‌ర్శించాల‌ని, ప్ర‌భుత్వం నిర్దేశించిన రేట్ల‌కు సినిమా టికెట్లు విక్ర‌యించాల‌ని పేర్ని నాని తెలిపారు. సినిమా టికెట్లు ఇక నుంచి ఆన్ లైన్ లో కొనుగోలు చేయొచ్చ‌ని చెప్పారు.

About Author