ఎఫ్ పిఐ ఖాతా ఫ్రీజ్.. రూ.55 వేలకోట్ల నష్టం
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ కుబేరుడు అదానీకి భారీ షాక్ తగిలింది. ఆయన సంపద ఒక్కరోజులో 55 వేల కోట్లు నష్టపోయారు. అదానీ గ్రూప్స్ లో పెట్టుబడులు పెట్టిన మూడు ఎఫ్ పిఐ ఖాతాలను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేయడంతో.. స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీలు లోయర్ సర్క్యూట్ లోకి చేరాయి. దీంతో అదానీకి 55 వేలకోట్ల నష్టం వాటిల్లింది. అల్బులా ఇన్వెస్ట్ మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లకు అదానీ గ్రూపుల్లో 43,500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మార్కెట్ నిబంధనల ప్రకారం ఎఫ్ పిఐల కస్టమర్ డాక్యుమెంటేషన్ తప్పనిసరి. ఫండ్ మేనేజర్స్ , కామన్ ఓనర్షిప్ లాంటి విషయాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మూడు ఎఫ్ పిఐలు మార్కెట్ నిబంధనల ప్రకారం వివరాలు వెల్లడించలేదు. అంతేకాక సెబీ రిజిస్ట్రేషన్ ప్రకారం ఈ మూడు ఎఫ్ పిఐ లకు మారిషస్ లోని పోర్ట్ లూయిస్ కి చెందిన ఒకే అడ్రస్ ఉంది. వీటికి ప్రత్యేకమైన వెబ్ సైట్లు కూడ లేవు. దీంతో డొల్ల కంపెనీలతో పెట్టుబడులు పెట్టి ఉంటారన్న అనుమానంతో ఈ మూడు ఎఫ్ పిఐ ఖాతాలు ఎన్ఎస్ డీఎల్ ఫ్రీజ్ చేసింది. దీంతో అదానీ గ్రూపుల్లోని ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు.