PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతుల ఆర్ధికంగా ఎదిగేందుకు (ఎఫ్ పిఓ) దోహదపడతాయి

1 min read

– జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు: రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్ధికంగా ఎదిగేందుకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్ పిఓ) దోహదపడతాయని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు.స్ధానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లాలో ఎప్ పిఓల ఏర్పాటు,ప్రోత్సాహం విషయంపై సంబంధిక అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతు ఉత్పాదక సంస్థలు రైతులకు సహాయ కారిగా ఉంటూ వారి ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా పని చేస్తాయన్నారు.అదే విధంగా మెరుగైన ఉత్పత్తిని నిర్ధారిస్తాయన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద ఏలూరు జిల్లాలో 11 ఎఫ్ పిఓలు ఏర్పాటవుతాయన్నారు. జిల్లాలో ఎఫ్‌పిఓల ప్రోత్సాహం కోసం సెంట్రల్ సెక్టార్ స్కీమ్ చిన్న మరియు సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎఫ్ పిఓలు సమర్థవంతమైన , ఖర్చుతో కూడుకున్న మరియు స్థిరమైన వనరుల వినియోగం ద్వారా ఉత్పాదకతను పెంచుతాయని మరియు వారి ఉత్పత్తులకు మెరుగైన లిక్విడిటీ, మార్కెట్ అనుసంధానం ద్వారా అధిక రాబడిని పొందుతాయన్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చి వారి ఆదాయాన్ని మెరుగుపరిచే సమిష్టి చర్య ద్వారా స్థిరంగా మారతాయన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏలూరు జిల్లాలో వివిధ సిబిబిఓఎస్ ల ద్వారా నాబార్డ్ మరియు ఎస్ ఎప్ఎసి ద్వారా 11 ఎప్ పిఓల ఏర్పాటును కమిటీ ఆమోదించింది. నాబార్డ్-డిడిఎం టి అనిల్ కాంత్ మాట్లాడుతూ 16 ఎఫ్ పిఓలు నాబార్డ్ ద్వారా ప్రమోట్ చేయబడి మరియు మద్దతిస్తున్నాయని మరియు 2020 నుండి ఎఫ్ పిఓలు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, మార్కెట్‌లకు భరోసా వంటి వివిధ మార్గాల్లో రైతులకు ప్రయోజనం చేకూర్చే కోసం సెంట్రల్ సెక్టార్ స్కీమ్ క్రింద నాబార్డ్ ద్వారా ఏర్పాటు చేయడమైయిందన్నారు. సమావేశంలో ఎల్ డిఎం ఎస్ ఎస్ వెంకటేశ్వర్ రావు, నాబార్డ్-డిడిఎం టి అనిల్ కాంత్, ఉధ్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ బి. పాండు రంగా, మత్స్యశాఖ ఎడి పి.ఈశ్వర్ సాగర్,పశు సంవర్ధక శాఖ ఎడి పి.సుబ్రహ్మణ్యం,మార్కెటింగ్ శాఖ మహేంద్ర నాథ్,జిల్లా సహకార ఆడిట్ అధికారి ఎ శ్రీనివాస్,భీమడోలు ఎఫ్ పిఓ రూపష్ తదితరులు పాల్గొన్నారు.

About Author