గాంధీ మునిమనవరాలి పై మోసం, ఫోర్జరీ కేసు..
1 min readపల్లెవెలుగు వెబ్: జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్ మీద మోసం, ఫోర్జరీ కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చుతూ.. దక్షిణాఫ్రికాలోని డర్బన్ న్యాయస్థానం 7ఏళ్ల జైలు శిక్ష విధించింది. గాంధీ మనవరాలు, దక్షిణాఫ్రికాలోని మానవ హక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుతురే ఆశిష్ లతా రాంగోబిన్. దక్షిణాప్రికాకు చెందిన న్యూ ఆఫ్రికా ఆలియన్స్ ఫుట్ వేర్ కంపెనీ డైరెక్టర్ ఎస్.ఆర్. మహారాజ్ ను మోసం చేసిన కేసులో ఆమె మీద 2015లో కేసు నమోదైంది. అనంతరం ఆమె బెయిల్ మీద బయటికొచ్చారు. విచారణ జరిపిన డర్బన్ న్యాయస్థానం ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తుది అప్పీలుకు కూడ అవకాశం ఇవ్వలేదు.