జెమ్ కేర్ కామినేని లో ఉచిత ఆర్థరైటిస్ స్క్రీనింగ్
1 min read– 600 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించిన జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరం కొత్త బస్టాండ్ బస్టాండ్ సమీపంలోని జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ లో ఆర్థ రైటీస్ డే సందర్బంగా గురువారం ఉచిత ఆర్థరైటిస్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు సి వి ఎస్ రవిబాబు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఉచిత వైద్య శిభిరంలో 600 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. రూ 3000 విలువైన పరీక్షలను ఉచితంగా నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్ కన్సల్టెషన్, ఫిజియో తేరఫీ కన్సల్టెషన్, ఎక్స్ రే, బోన్ మినరల్ డెన్సిటీ(బి ఎం డి ), బి ఎం ఐ స్క్రీనింగ్, బిపి చెక్అప్ , షుగర్ పరీక్షలు నిర్వహించామన్నారు. నేటి నుండి మూడు వారాలు వరకు పి ఆర్ పి ఇంజక్షన్ పై 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శృతి, జనరల్ సర్జన్ డాక్టర్ బాల మురళీ కృష్ణ, డాక్టర్ రామ్ మోహన్, డాక్టర్ గణేష్ (సి ఒ ఒ), ఆపరేషన్స్ హెడ్ నదీమ్ పాల్గొన్నారు.