PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కరువు మండలాల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు చక్రాల ముని నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.     ఈ మేరకు పత్తికొండ పట్టణంలో గురువారం రెవెన్యూ డివిజన్ అధికారిణి రామలక్ష్మి కి  పత్తికొండ టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ  వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడం జరిగిందని, కర్నూలు జిల్లాలో పత్తికొండ రెవెన్యూ డివిజన్లో వివిధ మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ ఎలాంటి కరువు సహాయక చర్యలు చేపట్టలేదని అన్నారు. కరువు సహాయక చర్యల్లో భాగంగా పత్తికొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు తక్షణమేఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు . అలాగే సీజనల్ హాస్టల్ లను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు వివిధ పరీక్ష ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాల  ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు BT.పవన్ కుమార్, జూటూరుతిమ్మరాజు,భాస్కర్నాయుడు,రోషన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

About Author