గ్రూప్-11 ప్రిలిమ్స్ పరీక్ష కు అభ్యర్థులకు ఉచిత శిక్షణ..
1 min readప్రారంభించిన డీఈవో శ్యాంసుందర్
50 రోజులపాటు ఉచిత శిక్షణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆంధ్రప్రదేశ్ బి.సి. స్టడీ సర్కిల్, ఏలూరు వారి ఆధ్వర్యములో గ్రూప్-11 ప్రిలిమ్స్ పరీక్ష కు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బి.సి., ఎస్.సి. డి ఎస్.టి అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని గురువారం డి ఈ వో శ్యాంసుందర్ ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఫిలిమ్స్ పరీక్షలకుసన్నదమవుతున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బి.సి., ఎస్.సి. 5 ఎస్.టి అభ్యర్ధులకు ఏలూరు బి.సి. స్టడీ సర్కిల్ కార్యాలయం నందు ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించడమైనది. 50 రోజుల పాటు జరిగే ఉచిత శిక్షణకు గాను 69 అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనగా 32 మంది అభ్యర్థులు మొదటి రోజు హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఏలూరు బి.సి.స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆర్.వి. నాగ రాణి , ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి పి. శ్యామ్ సుందర్, ఏలూరు బి.సి. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.పుష్పలత , మెంటల్ ఎబిలిటీ ఫ్యాకల్టీ .పి.ప్రసాద్ , ఇండియన్ సొసైటి ఫ్యాకల్టీ పరమేశ్వర్ మరియు బి.సి.స్టడీ సర్కిల్ సిబ్బంది హాజరైనారు.