NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీవారి ఉచిత దర్శనం..కర్నూలు నుంచి 500 మందికి అనుమతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక్క రోజైనా స్వామివారిని దర్శించి, సేవించుకోవాలని ఎంతోమంది ఉబలాట పడుతుంటారు. అటువంటి అరుదైన శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శంచుకునే అవకాశం ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారులకు లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆర్ధిక సహకారంతో సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆయా గ్రామాలలోని భక్తులకు ఈ అరుదైన అవకాశం లభించింది. తితిదే వారు ఏర్పాటు చేసిన 10 ఉచిత బస్సులలో పెట్నికోట, బెలుం సింగవరం, ఎల్లావత్తుల , గోవింద పల్లె, బత్తులూలు, దేవనబండ, నందిపాడు, చిన్నపాళెం, సీతామాపురం, చెరువుపల్లె, గుమ్మతంతాండ, పుట్టుపల్లి, బూపనపాడు, భ్రమరాంబికా గూడెం, శివపురం, 15 గ్రామాలనుండి సోమవారం ఉదయం 6-00 గంటలకు 500 మంది భక్తులు బయలుదేరి వెళ్లారని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. తితిదేనే వీరికి ఉచిత దర్శనం, భోజన వసతులు ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ అవకాశం లభించడం పట్ల భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు వీరికి భక్తితో భజనలతో జెండా ఊపి, స్వామి వారి దర్శనానికి సాగనంపారు.

About Author