PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కారాగార ఖైదీలకు ఉచిత దంత వైద్య శిబిరం..

1 min read

– జైల్ సూపర్డెంట్ సిహెచ్. ఆర్. వి. స్వామి ఆధ్వర్యంలో

– దంత పరీక్షలు చేసిన డాక్టర్ ఎస్ శ్రీహర్ష

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  ఏలూరు జైల్ సూపరింటెండెంట్ సిహెచ్.ఆర్.వి. స్వామి ఆధ్వర్యంలో ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ మరియు స్టార్ డెంటల్ హాస్పిటల్, ఏలూరు వారి సహకారంతో జిల్లా కారాగారంలో దంత వైద్య శిభిరం జరిగింది.జైలర్స్ కె.వెంకటరెడ్డి,కె. శ్రీనివాసరావు లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.శ్రీహర్ష ఖైదీలను మరియు సిబ్బందిని పరీక్షించి దంత సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.ఈ సందర్భంగా అవసరమైన వారికి మందులు, పేస్టులు ఉచితంగా అందజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు కెబిరావు, లయన్స్ జిల్లా నాయకులు ఎల్. వెంకటేశ్వరావు,సీనియర్ న్యాయవాది కూన కృష్ణారావు లు మాట్లాడుతూ భవిష్యత్ లో అవసరమైన వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ కె.సత్యనారాయణ,జైల్ సిబ్బంది మరియు స్టార్ డెంటల్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author