‘మా పార్టీ గెలిస్తే ఆ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ’
1 min read
పల్లెవెలుగు వెబ్ : రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆప్ గెలిస్తే ఉచిత విద్యుత్ అందిస్తామని పంజాబ్ ప్రజలకు కేజ్రీవాల్ భారీ తాయిలాన్ని ప్రకటించారు. త్వరలో పంజాబ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించారు. ఢిల్లీలో మహిళలు ఆనందంగా ఉన్నారని అన్నారు. పంజాబ్ లో కూడ ఇదే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వార కేజ్రీవాల్ పంజాబీలో ట్వీట్ చేశారు. చండీగడ్ వెళ్లడానికి ముందు ఆయన ఇలా ట్వీట్ చేయడం గమనార్హం. పంజాబ్ లో రైతాంగం పై ప్రజలు ఎక్కువ ఆధారపడతారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.