పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి వైద్య శిబిరం…
1 min read
ఏలూరు జిల్లా ఎస్పీ కె.శివ కిషోర్ ప్రతాప్ ఆదేశాలతో…
డాక్టర్ అగర్వాల్ కంటి వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
కంటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
వైద్య బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పి
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం, ఏలూరు అమీనా పేట లోని పోలీస్ కళ్యాణ మండపంలో, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలపై పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్యచంద్రరావు ప్రారంభించారు. ఆయన మొదటిగా శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుని కార్యక్రమాన్ని ఆరంభించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ, కన్ను అనేది మానవ దేహంలో అత్యంత ముఖ్యమైన అవయవమనీ, దాని సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు.డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రి ఉచిత కంటి పరీక్షలతో పోలీస్ సిబ్బందికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమైన పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు ప్రజలకు అందించగలుగుతారని తెలిపారు.ఈ ఉచిత కంటి శిబిరానికి పోలీస్ సిబ్బంది విస్తృతంగా హాజరై పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రి వైద్య బృందానికి అదనపు ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియ చేసినారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి చంద్రశేఖర్, ఏ ఆర్ ఆర్. ఐ పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
