మొబైల్ ఐసిటిసి ద్వారా ఉచితంగా హెచ్ఐవి పరీక్షలు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/3-6.jpg?fit=550%2C254&ssl=1)
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమములో బాగంగా గురువారం జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో స్థానిక వై.ఎస్.ఆర్ కాలనీ ఏలూరు లో సంచార హెచ్.ఐ.వి సలహా మరియు పరీక్ష కేంద్రము (Mobile ICTC) ద్వారా ఉచితముగా ప్రజలకు, గర్బిణి స్త్రీలకు, ట్రాన్స్ జెండర్లకు మరియు యువతకు హెచ్.ఐ.వి పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారి డా. ఎమ్. నాగేశ్వర రావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించే హెచ్.ఐ.వి సలహా మరియు పరీక్ష కేంద్రము సేవలను అందుకునేందుకు ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు రావాలన్నారు. అనంతరం ఆ ప్రాంతములో నివసిస్తున్న యువత మరియు ట్రాన్స్ జెండర్లు ముందుకువచ్చి హెచ్.ఐ.వి పరీక్షలు చేయించుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా ఆయన మొబైల్ ఐసిటిసి లో అందించే సేవలను తనిఖీ చేశారు. కార్యక్రమములో పి. బాలాజీ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్, ఏ. రాజశేఖర్, శిరీష, ఏ. శ్రీనివాస్ ప్రాజెక్టు మేనేజర్, ఏఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/31.jpg?resize=550%2C254&ssl=1)