NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మార్కెట్ యార్డ్ లో ఉచిత న్యాయవిజ్ఞాన శిబిరం

1 min read

పల్లెవెలుగు ,కర్నూలు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి .లీలా వెంకట శేషాద్రి  ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ,కార్మిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ నందు ఉచిత న్యాయవిజ్ఞాన శిబిరము ,ఉచిత మెడికల్ క్యాంపు ,ఈ శ్రామ్ కార్డులు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శాశ్వత లోక్ అదాలత్  చైర్మన్ రిటైర్డ్ జిల్లా జడ్జి శ్రీ వెంకట హరినాథ్  మాట్లాడుతూ శాశ్వత లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించగలిగిన సమస్యలను గురించి వివరించారు .డిప్యూటీ లేబర్ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ శ్రామ్ కార్డు వల్ల ఉపయోగాలను వివరించారు .లయన్స్  క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల వైద్య పరీక్షలను నిమిత్తం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు .మార్కెట్ యార్డ్ సెక్రటరీ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూఆరోగ్య  సమస్యల పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. గుండె వైద్య నిపుణులు  డాక్టర్ కే. అరుణ మాట్లాడుతూ ముందుగానే గుండె సమస్యలు గుర్తించగలిగితే వైద్యాన్ని అందించి ప్రాణాలను కాపాడగలమన్నారు .ఆర్థోపెడిక్ డాక్టర్  రవీంద్ర కుమార్ మాట్లాడుతూ శ్రామికులు కీళ్ల నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివరావు, అడ్వకేట్ నిర్మల ,మధుసూదన్ ,మోతి  భాష తదితరులు పాల్గొన్నారు. 150 మంది కార్మికులకు పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు .100 మందికి పైగా  ఈ శ్రామ్ కార్డులను అందజేశారు.

About Author