వడ్డీ లేని రుణాలు ఇవ్వడం శుభపరిణామం..
1 min readప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలిగించేది ఖిద్మత్ సొసైటీ..
ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు :ఖిద్మత్ సొసైటీ ప్రజలకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఏలూరు తంగెలమూడి ఎస్ ఎస్ వి ఎల్ ప్లాజా అపార్ట్మెంట్లో ఖిద్మత్ మ్యూచువల్లి ఎయిడైడ్ కో-ఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, నూతన బ్రాంచ్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సభా వేదిక తంగెలమూడి నేహర్ మసీదులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించే ఆలోచన ఇది అని ప్రశంసించారు. ఇటువంటి సొసైటీలకు తమ ప్రభుత్వం మద్దతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు ముహమ్మద్ రఫీఖ్ మాట్లాడుతూ సౌత్ ఇండియాలో 43 బ్రాంచ్ లు ఈ సంస్థ ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఏలూరుతో కలుపుకొని 13 వ.బ్రాంచ్ నేడు ప్రారంభించడం సంతోషదాయకమన్నారు . కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ సొసైటీలో అకౌంటు తెరిచి మూడు నెలలు అనంతరం వారి సేవింగ్స్ ని బట్టి రుణాలు మంజూరు చేస్తారన్నారు. 46 డివిజన్ ఇంచార్జ్ మరియు ఏలూరు మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ రియాజ్ అలీ ఖాన్, సొసైటీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎండి నైముల్లా ,మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ బాజీద్, డైరెక్టర్స్ ఎండి మునవర్, ఎండి రిజ్వాన్, ఎండి సాదతుల్లా, ఎండి చాంద్ , సొసైటీ మేనేజర్ షేక్ రబ్బాని, ఎంసీ చైర్మన్ నేరుసు చిరంజీవులు కార్పొరేటర్లు ఇలియాస్ పాష, సొసైటీ సిబ్బంది ఏ రెహమాన్ అక్బర్ ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.