ఉచిత వైద్య శిబిరం
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: గౌరవ జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, అమరావతి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి, పూర్తి అదనపు ఛార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు, శ్రీ ఎ. శ్రీనివాస కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారు, ఈ రోజు అనగా 21-10-2022 న జిల్లా న్యాయ సేవా సదన్ లో శుక్రవారం ఉదయం 09.30 గం!! నుంచి సాయంత్రం 04.00 గం!!ల వరకు డాక్టర్ ఎస్ రవితేజ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఎముకలు, నరములు మరియు వెన్నుముక సమస్యలను పరీక్షించి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలియజేసి వైద్య సదుపాయాన్ని అందించారు. మరియు వారికి బి.పి. పరీక్షలు కూడా చేశారు. ఈ శిబిరం ను జిల్లా జడ్జి శ్రీ ఎ. శ్రీనివాస కుమార్ గారు మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి ప్రతిభ దేవి గారు ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, జిల్లా కోర్టు సిబ్బంది, న్యాయవాదులు మరియు న్యాయవాదుల గుమాస్తాలు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ ఎస్. రవితేజ రెడ్డి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.