ఉచిత మెడికల్ క్యాంపు కు విశేష స్పందన
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు ఫిబ్రవరి 27 పట్టణ డాక్టర్ శివరామిరెడ్డి డాక్టర్ పద్మావతమ్మ వంశీధర నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది.ఈ ఉచిత మెడికల్ క్యాంపులో నంద్యాల పట్టణ ఐకాన్ ఐవిఎఫ్ సంతాన సాఫల్య కేంద్రం నుండి డాక్టర్ ఎం తనూజ పాల్గొని 40 మందికి వైద్య సేవలు అందించారు.అదేవిధంగా రాయలసీమ ఐ హాస్పిటల్ నుండి డాక్టర్ కే కావ్య కొండ కంటి వైద్య మరియు శాస్త్ర చికిత్స నిపుణులు పాల్గొని 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ తనూజ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సంతానం లేని సమస్యతో బాధపడుతున్న వారి సౌలభ్యం కోసం ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మెడికల్ క్యాంపులో వచ్చిన 40 పేషెంట్స్ కి వ సంతాన సాఫల్యం కోసం చిన్న చిన్న సమస్యలను వారికి తగిన మెడిసిన్ తో పాటు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందిఅన్నారు.సమస్యలు ఉన్నవారికి పరీక్షలు చేయించు కొని డాక్టర్ సూచనలు సలహాలు పాటించవలెను అన్నారు.కంటి వైద్య నిమణులు డాక్టర్ కావ్య కొండ మాట్లాడుతూ కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయరాదన్నారు.తగిన సమయంలో కంటి సమస్య ఉన్నవారు వైద్య నిపుణులు సంప్రదించి సులభముగా సమస్యను పరిష్కరించుకోవచ్చు అన్నారు .