NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మౌర్య హాస్పిటల్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

1 min read

నంద్యాల, న్యూస్​ నేడు:వ్యాయామం చేయకపోవడం…ఫాస్ట్​ ఫుడ్​ కు అలవాటు పడటం…సమయానికి పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం… తదితర కారణాలతో గ్యాస్ట్రిక్​ సమస్యలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు మౌర్య హాస్పిటల్​ నిర్వాహకులు, గ్యాస్ట్రిక్ మరియు బారిట్రిక్​  వైద్య నిపుణులు డా. ఎస్​. వసీం హాసన్​ రాజా. మంగళవారం నంద్యాల జిల్లా ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​  అధికారులు, సిబ్బందికి మౌర్య హాస్పిటల్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి ECG, 2DECHO మరియు  రక్త పరీక్షలు చేశారు. వైద్య చికిత్సలు చేసి… మందులు ఉచితంగా అందజేశారు. ఆ తరువాత డా. వసీం హాసన్​ రాజ మాట్లాడుతూ గ్యాస్ట్రిక్​ సమస్య కారణంగా అప్పుడప్పడు ఎదలో నొప్పిగా ఉంటుందని, అది గుండె నొప్పా… లేదా గ్యాస్ట్రిక్​ సమస్య అని దగ్గరలోని వైద్యులను  సంప్రదించాలన్నారు. ప్రతి రోజు  ఉదయం వ్యాయామం చేయాలని సూచించారు.  కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఫారెస్ట్ అధికారిణి (DFO ) T. నాగమహేశ్వరీ , సిబ్బంది పాల్గొన్నారు.

About Author