NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశాఖ.. బీవీకే పాఠశాలలో ఉచిత వైద్యశిబిరం

1 min read

కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలు

వ్యాధులపై అవగాహన పెరగాలి

విశాఖపట్నం:చిన్నప్పటి నుండె వ్యాధులపై అవగాహన పెంచడం వల్ల పిల్లలు శుభ్రత, పరిశ్రుభతను పాటిస్తారని కిమ్స్ కడల్స్ వైద్యులు అన్నారు. గురువారం షీలానగర్ లోని బివికె పాఠశాలలో కిమ్స్ కడల్స్, వైజాగ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పీడియాట్రిక్స్, డెంటల్, ఆఫ్తాల్మాలజీ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొని విద్యార్థులకు కంటి, దంత, ఇతర పరీక్షలు చేశారు. అనంతరం చిన్నపిల్లల వైద్య నిపుణలు సంతోష్ కుమార్ రౌతు మరియు డాక్టర్. నిఖిల్ తెన్నేటి మాట్లాడుతూ చలికాలంలో వస్తున్న మార్పుల వల్ల చిన్నపిల్లలు వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. పిల్లలకు గోరు వెచ్చని నీరు తాగించడం అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచే వారికి పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్యంగా జీవిస్తారు.

కిమ్స్​ కడల్స్​ ఆధ్వర్యంలో…ఉచిత వైద్యశిబిరం..:

కిమ్స్ కడల్స్ యాజమాన్యం బివికే పాఠశాలలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయమని పాఠశాల సిబ్బంది  కృష్ణ మోహన్, జ్యోస్న, సుభాషిణిలు పేర్కొన్నారు. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా వివిధ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో వ్యాధులపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో కిమ్స్ కడల్స్ వైద్య బృదం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author