NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయ సేవసదన్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు…

1 min read

– ఉచిత బి.పి, సుగర్, కంటి, చెవి, ఊపిరితిత్తులు మరియు గుండెపరీక్షలు పై అవగాహన సదస్సు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా న్యాయమూర్తి శ్రీ ఎన్.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు, ఈ రోజు ఉచిత వైద్య శిబిరము న్యాయ సేవసదన్ నందు నిర్వహించబడినది. ఈ శిబిరము నందు బి.పి, సుగర్, కంటి, చెవి, ఊపిరితిత్తులు మరియు గుండెపరీక్షలు వైద్య నిపుణుల చేత మరియు యన్ జి ఓ మరియు పారాలీగల్ వాలంటీర్ శ్రీ కె. జి. గంగాధర్ రెడ్డి గారు సహకారంతో నిర్వహించడమైనది.  ఈ కార్యక్రమంను జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు గారు, ప్రజా వినియోగ సేవల కోసం శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు శ్రీ వెంకట హరినాథ్ గారు, కర్నూలు బార్ అసోసియేషన్ అద్యక్షులు శ్రీ నాగభూషణం నాయుడు గారు మరియు యన్ జి ఓ మరియు పారాలీగల్ వాలంటీర్ శ్రీ కె. జి. గంగాధర్ రెడ్డి గారు న్యాయ సేవసదన్ నందు ప్రారంభిచారు. ఈ అవకాశాన్ని  న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు మరియు ప్రజలు సుమారు 200 మంది  వినియోగించుకున్నారు.  పై పరీక్షలన్నియు మెడికోవర్ మరియు శాంతిరామ్ హాస్పిటల్ కర్నూలు  వైద్యుల సహాయ సహకారాలతో ఉచితముగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో వైద్యులు డా.కె. వరప్రసాద్  పల్మోనోలజిస్ట్ మరియు డా. సమీరా గుండె వైద్య నిపుణురాలు, మెడికోవర్ హాస్పిటల్, కర్నూలు,  డా.బి. చిన్ని రెడ్డి  ఆప్తమాలజిస్ట్, శాంతిరామ్ హాస్పిటల్  మరియు వైద్య సిబ్బంధి తదితరులు పాల్గొన్నారు. 

About Author