NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం

1 min read

– ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోన్న ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని బిజినవేముల సర్పంచి రవి యాదవ్ అన్నారు. మండలంలోని బిజినవేముల గ్రామంలో బుధవారం ఇఫ్కో కో అపరేటివ్స్ అలాగే అమీలియో హాస్పిటల్ కర్నూలు వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచి రవి యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచి రవి యాదవ్ మాట్లాడుతూ పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పట్టణాల్లో ఉన్న కార్పొరేట్‌ వైద్యశాలల్లో క్షణం తీరిక లేకుండా వైద్యపరీక్షలు నిర్వహించే డాక్టర్ల బృందం ఉచిత వైద్య శిబిరానికి తరలివచ్చి అన్ని పరీక్షలు చేసి సామాన్య ప్రజలకు సేవలు చేయడమే కాక మందులు కూడా ఉచితంగా అందించారని, వీరి సేవలు ఎన్నటికీ మరువలేమని వైద్య అధికారులను అభినందించారు. అమీలియో హాస్పిటల్ వైద్యురాలు యశోద, ఇఫ్కో జిల్లా మేనేజర్ జి.బి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బిసి, ఇసిజి, సుగర్‌ టెస్ట్‌తో ఇతర వైద్య పరీక్షలలు కూడా ఉచితంగా అందించి, మందులు పంపిణీ చేయడం చేస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. దాదాపు 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కమలాకర్, లాబ్ టెక్నీషియన్ లక్ష్మణ్ , సిబ్బంది కృష్ణమ్మ, సేల్స్ మేనేజర్ ఇర్ఫాన్ భాషా , ఉప సర్పంచి అభూబక్కర్, వార్డు సభ్యులు మహమ్మద్ రఫీ , శ్రీరాములు, బాలీశ్వరయ్య ,మల్లి కార్జున .గ్రామస్తులు ఏసు రత్నం, రమణయ్య, చికెన్ శ్రీను, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author