ఖైదీలకు ఉచిత వైద్య పరీక్షలు… మందులు పంపిణీ..
1 min read– సేవా భావంతో వైద్యులు సహకారం అభినందనీయం..
– జైల్ సూపర్డెంట్ సి హెచ్ ఆర్ వి స్వామి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు జైల్ సూపరింటెండెంట్ సిహెచ్.ఆర్.వి.స్వామి ఆధ్వర్యంలో ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ మరియు సుశ్రిత ఇ.ఎన్.టి. & స్కిన్ హాస్పిటల్,ఏలూరు వారి సహకారంతో జిల్లా కారాగారంలో చెవి,ముక్కు,గొంతు మరియు చర్మవ్యాధుల వైద్య శిభిరంను నిర్వహించారు. జైలర్స్ కె. వెంకటరెడ్డి, కె.శ్రీనివాసరావు లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రముఖ ఇ.ఎన్.టి. వైద్య నిపుణులు డాక్టర్ కొత్తా నాగేశ్వరరావు, స్కిన్ వైద్య నిపుణులు డాక్టర్ కొత్తా నాగేశ్వరి లు ఖైదీలను మరియు సిబ్బందిని పరీక్షించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. సంస్థ ప్రతినిధులు ఎల్.వెంకటేశ్వరావు, సీనియర్ న్యాయవాది కూన కృష్ణారావు లు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ప్రముఖ వైద్యులు ద్వారా హేలాపురి లయన్స్ క్లబ్ వారు ఈ రకమైన సేవలు అందించటం అభినందనీయమన్నారు. భవిష్యత్ లో అవసరమైన వైద్య సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ కె.బి.రావు,సెక్రెటరీ బి.వి.వి.సత్యనారాయణ,డిప్యూటీ జైలర్లు కె.సత్యనారాయణ, ఎం.కిషోర్ కుమార్, జైల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవలు అందించిన వైద్యులను లయన్స్ క్లబ్,జిల్లా జైల్ తరుపున సన్మానించారు.