ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో రామనపల్లిలో నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంపులో భాగంగా ఐదవ రోజు సోమవారం రామనపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది, ఈ మెడికల్ క్యాంపు ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. సలీం భాషా మాట్లాడుతూ. ,ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ నారాయణ ముఖ్యఅతిథిగా విచ్చేసి గ్రామంలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందన్నారు, వైద్య శిబిరానికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ డాక్టర్ ఆధ్వర్యంలో బ్లడ్ ప్రెషర్ ను పరీక్షించి తగిన మందులను అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు, అనంతరం డాక్టర్ నారాయణ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, అలాగే పోషక విలువలు కలిగిన ఆహారము తీసుకొని డాక్టర్ సలహా మేరకు మందులను వేసుకోవాలని తెలియజేశారు,ప్రతి వ్యక్తి కూడా సరైన జీవనశైలితో నివసించినట్లయితే తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించిన వారు అవుతారని ఆయన తెలిపారు, ప్రతిరోజు క్రమం తప్పకుండా చిన్నచిన్న వ్యాయామాలు చేస్తూ, సమయానికి ఆహారం తీసుకుని, మంచి నిద్రను కలిగి ఉండాలని తెలియజేశారు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకమై అక్కడి ముఖాముఖి చర్చించి ఆరోగ్య సంబంధమైన సూచనలను, సలహాలను గ్రామీణ ప్రజలకు తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు, ఈ మెడికల్ క్యాంపులో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి.విజయలక్ష్మి దేవి, వాలంటీర్లు, పాఠశాల ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు రఘునాథరెడ్డి, స్వరూప రాణి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.