PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

200 మందికి ఉచిత  వైద్య సేవలు

1 min read

– ఉచితంగా మందులు పంపిణీ

పల్లెవెలుగు  వెబ్ చెన్నూరు: కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రమ్యత రెడ్డి, డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో  ఆదివారం 200 మందికి ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా, వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు, స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి, మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని కమలాపురం శాసనసభ్యులు కుమార్తె సన్ రైజ్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రమ్యత రెడ్డి, డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అక్కడికి వచ్చిన రోగులకు బిపి ,షుగర్ వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు, అలాగే విష జ్వరాలు, గుండె సమస్యలు, ఎముకలు కీళ్ల వ్యాధులు, కిడ్నీ ,డయాలసిస్, థైరాయిడ్ గడ్డలు, పలు రకాలైన క్యాన్సర్ జబ్బులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది, ఈ వైద్య సదుపాయాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు , ఈ కార్యక్రమంలో మండల ప్రజలతో పాటు, వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య శిబిరాన్ని జయప్రదం చేయడం జరిగింది.

About Author