104 ద్వారా ఉచిత వైద్య సేవలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ మండలం చిన్న హెల్త్ గ్రామంలో బుధవారం 104 ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. 14 రకాల చికిత్సలు, 105 రకాల మందులను వైద్య సిబ్బంది రోగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్, పీహెచ్ఎన్ గంగా రత్నమ్మ, హెల్త్ సూపర్వైజర్ లక్ష్మీదేవి, హెల్త్ అసిస్టెంట్ రమేష్ బాబు, ఎమ్.ఎల్. హెచ్. వాణి రోగులకు అన్ని రకాల పరీక్షలు చేసి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.