NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉచిత సామూహిక సేవలు

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  శ్రీశైల మహా క్షేత్రంలో ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉచిత సామూహిక సేవలలో భాగంగా కుంకుమార్చనను నిర్వహించింది. తెల్లరేషన్కార్డు  కలిగిన వారి సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత సామూహిక సేవ భాగంగా అక్కమహాదేవి అలంకార మండపంలో కుంకుమార్చనను ఆలయ అర్చకులు నిర్వహించారు సామూహిక కుంకుమార్చనలో మొత్తం 110 మంది భక్తులు పాల్గొన్నారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న భక్తుల చేత సామూహిక కుంకుమార్చన జరిపించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదాలు అందజేశారు వీరికి అన్నపూర్ణ మందిరంలో భోజనం సదుపాయం ఆలయ అధికారులు కల్పించారు ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆలయ సహాయ కమిషనర్ వెంకటేష్ పదివేక్షకులు మరియు ఆలయ పీఆర్ఓ పాల్గొన్నారు.

About Author