డిసెంబర్ నుంచి.. ఉచిత రేషన్ బంద్ !
1 min readపల్లెవెలుగు వెబ్: డిసెంబర్ నుంచి ఉచిత రేషన్ పంపిణీ నిలిపివేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద నవంబరు 30 తర్వాత కూడా ఉచిత రేషన్ పంపిణీ ని కొనసాగించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. కరోనా పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని శుక్రవారం ఆయన మీడియాకు చెప్పారు. బహిరంగ మార్కెట్ విక్రయ విధానం కింద ఆహారధాన్యాల సరఫరా సమర్థంగా జరుగుతున్నందున.. ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారు. కాగా, కరోనా వేళ పీఎంజీకేఏవై అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి నెలా అదనంగా 5 కిలోల చొప్పున ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేశారు. 2020 ఏప్రిల్, మేలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. అనంతరం రూ.90వేల కోట్ల వ్యయం అంచనాలతో అదే ఏడాది నవంబరు వరకు ఈ పథకాన్ని పొడిగించారు.