ఆశ్రమం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత స్కానింగ్ క్యాంప్
1 min read
పెద్ద ఎత్తున పాల్గొన్న మున్సిపల్ స్టాఫ్,శానిటేషన్ సిబ్బంది
ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పు కారణంగా క్యాన్సర్ వ్యాధి
ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్ పెదబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆశ్రమం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఉదయం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ప్రారంభించారు.ఈ సందర్భంగావారు ఇరువురు మాట్లాడుతూ ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పు కారణంగా క్యాన్సర్ వ్యాధి వ్యాపిస్తుందన్నారు.చెడుఅలవాట్లు కారణంగా,పరిశుభ్రత పాటించనందువల్ల కూడా క్యాన్సర్ వ్యాధి రావచ్చన్నారు.పేద,మధ్యతరగతి కుటుంబంలో ఈ వ్యాధికి సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పనిఅని అందువలన ఉచితంగా ఈ స్క్రీనింగ్ క్యాంప్ ను మున్సిపల్ స్టాఫ్ మరియు శానిటేషన్ సిబ్బందికి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశామన్నారు.శాసనసభ్యులు చంటి,మేయర్ నూర్జహాన్ పెదబాబు దగ్గర ఉండి శానిటేషన్ సిబ్బందికి పరీక్షలు చేయించారు. అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించే యూనిట్ను వారు ఇరువురు సందర్శించారు.ఆశ్రమం ఆసుపత్రి సి ఓ ఓ రాజరాజన్ ఆధ్వర్యంలో డాక్టర్ హేమా నలిని,డాక్టర్ డివి సాయి షణ్ముఖ గౌతమ్,డాక్టర్ సుప్రియ స్పందన, డాక్టర్ హరిత బృందం పరీక్షలు నిర్వహించారు.ఆశ్రమం ఆసుపత్రి మేనేజర్ భాను ప్రదీప్ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ ఏ.భాను ప్రతాప్,డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు,వందనాల దుర్గాభవాని శ్రీనివాస్,కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు,పాము శామ్యూల్,ఉచ్చుల సన్నీ సుజాత తదితరులు పాల్గొన్నారు.