ఎంబ్రాయిడరీపై మహిళలకు ఉచిత శిక్షణ
1 min read– ఉచితంగా భోజనం మరియు హాస్టల్ వసతి
పల్లెవెలుగు వెబ్ కల్లూరు: కెనరా బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా కర్నూలు మరియు నంద్యాల జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలకు ఎంబ్రాయిడరీ(మగ్గం వర్క్)లో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ బి.శివప్రసాద్ ప్రకటనలో తెలియజేశారు.18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండి చదవడం రాయడం వచ్చి ఉండాలని శిక్షణ కాలంలో మహిళలకు ఉచిత భోజనం మరియు హాస్టల్ వసతి కల్పించడం జరుగుతూ ఉందని డైరెక్టర్ తెలిపారు.ఆసక్తిగల మహిళలు నాలుగు ఫోటోలు, రేషన్ కార్డు,ఆధార్ కార్డు,బ్యాక్ అకౌంటు మరియు విద్యార్హత జిరాక్స్ కాపీలను తీసుకుని సంస్థ యందు దరఖాస్తు చేసుకోవాలని మాసంస్థ చిరునామా కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కర్నూలు లోని కల్లూరు తహసిల్దార్ కార్యాలయం పక్కన కెనరా బ్యాంకు హౌసింగ్ బోర్డు బ్రాంచ్ పైన మూడవ అంతస్తు వివరాలకు 6304491236 అని నంబర్ కు సంప్రదించవచ్చని డైరెక్టర్ బి.శివప్రసాద్ తెలియజేశారు.