పర్సనాలిటీ డెవలప్ మెంట్ లో ఉచిత శిక్షణ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా సర్టిఫికెట్ కోర్స్ ఇన్ పర్సనాలిటీ డెవలప్ మెంట్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు .13 నుంచి 20 సంవత్సరాలు లోపు వారు ఈ శిక్షణలో పాల్గొనవచ్చని ఆసక్తి గల వారు తమ పేర్లను 3 వ తేదీ లోగా వెంకటరమణ కాలనీ మొదటి లైన్ లో ఉన్న నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని 5 వ తేదీ నుంచి ఇంపాక్ట్ ట్రైనర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ కార్యదర్శి లయన్ టీ. గోపీనాథ్, ఇంపాక్ట్ ట్రైనర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఉపాధ్యక్షులు లయన్ కె .మహేంద్ర ట్రైనర్లుగా తరగతులు ప్రారంభమవుతాయని శిక్షణానంతరం సర్టిఫికెట్ అందజేయబడుతుందని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ పవన్ కుమార్, కోశాధికారి తెలుగు అనూష లు తెలియజేశారు .