PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్విస్ ఛాలెంజ్ విధానంలో ఉచిత ప్రయాణం…

1 min read

– ఇత్తడి సుబ్బారావు
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: వర్క్ ఆన్ వీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ .ప్రపంచ ప్రయాణికుల ఫెస్టివల్ వారి చేత ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన ఫెస్టివల్ లో ప్రశంసలు పొందిందని ఏపీఎస్ఆర్టీసీ వారికి స్విస్ చాలెంజి లో రూ.1500 కోట్ల పెట్టుబడి తో పిపిపి విధానంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఇనేయబులింగ్ యాక్ట్ 2001 బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో ఈరోజు టెక్నికల్ బిడ్ మరియు ఫైనాన్షియల్ బిడ్ సమర్పించడం జరిగిందని యువ పారిశ్రామికవేత్త ఇత్తడి సుబ్బారావు తెలియజేశారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కే ఎస్ ఆర్ టి సి (కర్ణాటక )కు రూ.1100 కోట్లు పెట్టుబడి పి .పి.పి స్విస్ చాలెంజి విధానంలో టి ఎస్ ఆర్ టి సి (తెలంగాణ )రూ.1100 కోట్లు ఇదే విధానంలో ఇండియన్ రైల్వేస్ కు రూ. 1,53,000 కోట్ల పెట్టుబడి తో పి పి పి విధానం(ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబుల్ంగ్ యాక్ట్ 2001) బిల్ట్- ఆపరేట్ -ట్రాన్స్ఫర్ విధానంలో టెక్నికల్ బిడ్, మరియు ఫైనాన్షియల్ బిడ్, సమర్పించడం జరిగింది.ఆని ఫైనాన్స్ ఆపరేట్ మెయిన్ టెయిన్ ట్రాన్స్ఫర్ విధానంలో సమర్పించడం జరిగిందని అన్నారు . తాను చేసిన ప్రయోగంతో లాభాలు బాట పట్టించవచ్చని ఆయన అన్నారు. బస్సు, రైలు ,విమానాల్లో ,వర్క్ ఆన్ వీల్స్ ప్రయోగం ద్వారా ఆయా వాహనాల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం వస్తుందని ఆయన అన్నారు. పని చేసే ప్రయాణికులకు ఉచిత ప్రయాణం సీసీటీవీ కెమెరా ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం అందరికీ సమానంగా పూర్తి ఏ.సీ బస్సులు ఆర్టీసీ కార్మికులకు వేతన అదనపు ప్రయోజనాలు స్కాలర్షిప్ లు, వారి పిల్లలకు జర్నలిస్టులకు ,వారి కుటుంబ సభ్యులకు జీవితకాలం ఏపీఎస్ఆర్టీసీ అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం ,ఈ విధానం ద్వారా సౌకర్యాలు కలిగించవచ్చని ఇత్తడి సుబ్బారావుఅన్నారు.

About Author