ఉచిత యునాని వైద్య శిబిరానికి విశేష స్పందన
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణం హజీనగర్ ఉర్దూ పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన యునాని ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు రెండు వందల మంది ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆయుష్ కమిషనర్ మరియు రీజినల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు వైసీపీ జిల్లా కమిటీ సభ్యులు 27వ వార్డు ఇంచార్జి ఉస్మాన్ బేగ్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యునాని పై మెడికల్ ఆఫీసర్ జమాలుద్దీన్ మరియు వైద్యుల బృందం ప్రజలకు అవగాహన కల్పించారు. రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉస్మాన్ బేగ్ మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు డా. ఫిరాన్ సాహెబ్, మహబూబ్ బాష, డా. రహత్ బీ, డా.ఆస్గర్ సాహెబ్, డా. షాహిద్, 12, 13, 27 వార్డు ప్రజలు , తదితరులు పాల్గొన్నారు.