స్వాతంత్య్ర సమర యోధులు.. యువతకు స్ఫూర్తి..
1 min read– యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ప్రశాంత్ దేశాయ్
పల్లెవెలుగు వెబ్: స్వాతంత్ర్య పోరాట యోధుల త్యాగఫలితమే మన స్వేచ్ఛ… అని, అటువంటి మహానుభావులను స్మరించుకోవడమేకాక స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ప్రశాంత్ దేశాయ్. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని.. సోమవారం రీజనల్ ఆఫీస్పై జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అంతకు ముందు జాతిపిత మహాత్మగాంధీ , రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ దేశాయ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందన్నారు. కాలానుగుణంగా యువత ఆలోచనలో మార్పు రావాలని, ఉద్యోగం సాధించడమే కలగా మారకూడదని, వంద మందికి ఉద్యోగ అకాశాలు కల్పించే దిశగా ఆలోచించి.. విజయం సాధించాలన్నారు. స్వాతంత్ర్య పోరాట యోధుల త్యాగనిరతిని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రజలకు, బ్యాంకు ఖాతాదారులకు ,ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డిప్యూటీ రీజనల్ హెడ్ వైఎన్వీఎస్ మూర్తి మాట్లాడుతూ.. యువత ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలని, అందుకు మెరుగైన మెళకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులతోపాటు…. వివిధ రంగాల్లో విజయం సాధించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
–