శిధిలావస్థలో మంచినీటి ట్యాంకు.. కూలితే గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రంలో బొల్లవరం రాస్తా లో ఉన్న మంచినీటి ట్యాంకు శిథిలావస్థ చేరి కూలడానికి సిద్ధంగా ఉంది గడివేముల గ్రామంలో బొల్లవరం రాస్తాలో ఉన్న మంచినీటి ట్యాంకు గతంలో ఊరికి మొత్తం ఇక్కడి నుంచి నీరు సరఫరా అయ్యేది జనాభా పెరుగుదలతో బీసీ కాలనీలో కొత్త మంచినీటి ట్యాంకు నిర్మించి సగం గ్రామానికి తాగునీటి అవసరాన్ని తీరుస్తున్నారు తాతల కాలం నాటి మంచినీటి ట్యాంకు శిథిలమై పిల్లర్స్ లో కడ్డీలు బయటపడి నేడో రేపో కూలడానికి సిద్ధంగా ఉన్న ఇప్పటికే ఎన్నోసార్లు ప్రముఖ పత్రికల్లో కథనాలుగా రాసిన అధికారులకు చలనం లేదు ప్రమాదం జరగకముందే నివారించాల్సిన అధికారులు ప్రమాదం జరిగాక వీటిపై దృష్టి సారిస్తారో ఏమో మరి కూలితే మాత్రం సగం గ్రామానికి సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేక తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త మంచి నీటి ట్యాంకు నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.