PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్నేహమంటే విడదీయరాని బంధం

1 min read

-ఘనంగా పూర్వపు విద్యార్థుల సమ్మేళనం

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: స్నేహం అంటే వెలకట్ట లేనిదని స్నేహాన్ని విడదీయరాని బంధమని మీ స్నేహితులు ఆపదలో ఉంటే మీరు ఆదుకుంటూ ధైర్యాన్నిస్తూ మీ స్నేహ బంధానికి ఇంకా ఊపిరి పోయాలని జడ్పీహెచ్ఎస్  రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎస్ఏ గఫూర్ అన్నారు. కర్నూలు మండల పరిధిలోని గార్గేయపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1998-99 బ్యాచ్..25 సంవత్సరాల పదవ తరగతి పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమానికి అప్పటి పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి,బాలిరెడ్డి, శ్యామలాదేవి,వసంతకుమారి, బాలమద్దయ్య,రమాదేవి హాజరై వారు 25 సంవత్సరాల తర్వాత మీరంతా కలసి ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు చాలా సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో మీరు సుఖ సంతోషాలతో మీ స్నేహబంధం ఒకరి నొకరు పాలుపంచుకోవాలని ఉండాలని అన్నారు.అదే విధంగా మీ పిల్లలను మంచిగా చదివించాలని వారికి చిన్న వయసులో వివాహాలు చేయకుండా ఉండాలని అన్నారు అంతే కాకుండా గతంలో జరిగిన విషయాలను ఉపాధ్యాయులు మరియు పూర్వపు విద్యార్థులు గుర్తుకు తెచ్చుకున్నారు.మీరు మాకు చెప్పిన విద్యాబోధన వల్లే మేము ఈ స్థాయికి ఎదిగామంటూ పూర్వపు విద్యార్థులు పురుషులు స్త్రీలు ఉపాధ్యాయులతో అన్నారు.   తదనంతరం ఉపాధ్యాయులను శాలువా పూల మాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు బాలకృష్ణ, సలావుద్దీన్,రంగస్వామి, రామచంద్రుడు,గఫూర్, సయ్యద్ బాష,కమ్ము సాహెబ్ మరియు పూర్వపు విద్యార్థులు పురుషులు స్త్రీలు పాల్గొన్నారు.

About Author