భయంతో మహిళలు జుట్టు కత్తిరించుకుంటున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ లో రష్యన్ సైనికుల దాష్టీకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రష్యన్ సైనికుల దాష్టీకాల నుంచి తప్పించుకోవడం కోసం మహిళలు తమ జుట్టును కత్తిరించుకుంటున్నారు. ఇవాన్‌కివ్ గ్రామం 35 రోజుల తర్వాత మార్చి 31న రష్యా సేనల నుంచి ఉక్రెయిన్ వశమైంది. ఇక్కడ రష్యన్ సైనికులు పాల్పడిన దురాగతాల గురించి స్థానికులు మీడియాకు వివరిస్తున్నారు. కీవ్ డిప్యూటీ మేయర్ మెరీనా తెలిపిన వివరాల ప్రకారం ఇవాన్‌కివ్ అనే శివారు గ్రామంలో 15, 16 సంవత్సరాల వయసుగల అక్కచెల్లెళ్ళపై రష్యన్ సైనికులు దారుణంగా అత్యాచారం చేశారు. బేస్‌మెంట్లలో ఉన్న మహిళలను జుట్టు పట్టుకుని సైనికులు లాక్కెళ్తున్నారు. దీంతో వికారంగా కనిపించడానికి, అదేవిధంగా జుత్తు సైనికులకు అందకుండా చేయడానికి ఉక్రెయిన్ మహిళలు తమ జుత్తును కత్తిరించుకుంటున్నారు.