19 నుంచి.. ప్రజాపోరుయాత్ర: ప్రేమ్‌కుమార్
1 min read
బిజెపి కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ ఎం ప్రేమ్ కుమార్
పల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చేస్తున్నరాచకాలను ఎండగడతామని కోడుమూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ ఎం ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రజా పోరు యాత్రను నిర్వహిస్తున్నామని ఈ యాత్రలో ప్రతి నియోజకవర్గానికి 30 స్ట్రీట్ లో సభలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు అలాగే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రజల్లో చైతన్యం చేస్తూ రాబోయే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరవేస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపూరు యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బెస్త ఈరన్న, పుల్లయ్య మధు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.