ఈనెల 25 నుంచి అన్ని పరోక్ష ఆర్జిత పూజ సేవలు నిలుపుదల
1 min read
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ఈనెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహాకుంభాభిషేక మహోత్సవం లో భాగంగా శ్రీశైలం దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోందికుంభాభిషేకాన్ని పురస్కరించుకుని శివాజీ గోపురం సువర్ణ కలశ ప్రతిష్టలు, ఆలయ ప్రాంగణమునందు. గల ఆలయాలకు పునరుద్ధరణ చేయబడుతున్న ఆలయాలు నందు ప్రతిష్టలు, శిఖర ప్రతిష్టలు, యంత్ర ప్రతిష్టలు. మరియు పంచ మఠం లో పునరుద్ధరణ గావించబడినటు వంటి లింగ యంత్రలు శిఖర ప్రతిష్టలు చేయుటలో భాగముగా మే 25 నుండి 31 వరకుఅన్ని పరోక్ష సేవలు మరియు అర్జిత సేవలు నిలుపుదల చేయుటకు. ఆలయ ఈవో లవన్న తెలియజేశారు.