28 నుంచి గంజహళ్లి బడేసాహెబ్ తాత మాస పూజలు
1 min read– ఉదయం రాష్ట్ర స్థాయి న్యూకేటగిరి ఎద్దుల బండలాగుడు పోటీలు
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : గోనెగండ్ల మండల పరిధిలోని గంజహళ్లి గ్రామంలో వెలసిన మహత్మ బడేసాహెబ్ స్వామి వారి మాస పూజలు మంగళవారం జరగనున్నట్లు దర్గా ధర్మకర్త, పీడాధిపతులు తెలిపారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. స్వామివారి జీవసమాధి నీ ప్రత్యేక పూలతో అలంకరిస్తారు. ఈ హజా కార్యక్రమంలో వేలాది మంది భక్తులు హజరవుతారన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే మంగళవారం ఉదయం రాష్ట్ర స్థాయి న్యూకేటగిరి ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ 50వేలు, రెండవ బహుమతి రూ. 40 వేలు, మూడవ బహుమతి రూ 330వేలు, నాల్గబహుమతి రూ. 20వేలు, ఐదో బహుమతి రూ. 10వేలు అందజేస్తున్నామన్నారు. ఆసక్తి గత వారు రూ. 600 లు ప్రవేశ రుసుము చెల్లించి తమ పేర్లను నమోదు : చేసుకోవాలని కోరారు. అలాగే సాయంత్రం కూచిపూడి నృత్యప్రదర్శన, భజనగీతాలు, అన్నమయ్య సంకీర్తనలు, ఖవ్వాలి గీతాలాపన జరుగుతున్నట్లు తెలిపారు. బండలాగుడు పోటీలలో పాల్గొనేవారు ఇతర వివరాలకు 9441181021, 7889728402,9666030606 లను సంప్రందిచాలని కోరారు.