జులై 3 నుంచి.. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్
1 min readపల్లెవెలుగు వెబ్ : వ్యాక్సినేషన్ ప్రక్రియ తెలంగాణలో వేగవంతంగా సాగుతోంది. ప్రస్తుతం 30 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. జులై 3నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడ వ్యాక్సిన్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వచ్చినా.. లేదా.. కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కోవిడ్ వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ అందిస్తామని అధికారులు తెలిపారు. కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న వారికి 14 నుంచి 16 మధ్య రెండో డోసు ఇవ్వనున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.